చిప్పగిరి: తహసీల్దార్ అక్రమాలపై ఆర్డీఓ విచారణ

చిప్పగిరి మండలంలో నూతన రేషన్ డీలర్ల నియామకం, పొజిషన్ పట్టాల మంజూరులో భూ సంబంధిత అక్రమాలకు తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆర్డీఓ భరత్ నాయక్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులైన సర్పంచ్లు దాసరి గోవింద రాజులు, కొండా పురుషోత్తం, బంటనాల్ వాసి సురేష్ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్