కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి ఫిర్యాదుల పరిష్కార వేదికలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం తుగ్గలి మండలంలోని సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలే వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, కాలువలు, పెన్షన్లు తదితర సమస్యలపై వచ్చిన అర్జీలను వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్