పత్తికొండ: ప్రధాని పర్యటన విధుల్లో సీఐ, ఎస్సైల సేవలకు ప్రశంస

కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, జొన్నగిరి ఎస్సై మల్లికార్జునలను జిల్లా ఎస్పీ విక్రాంతా పాటిల్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. కర్నూలులో సీఐ, ఎస్సైలకు ప్రశంసా పత్రాలు అందజేసి, భద్రతా చర్యల్లో ప్రదర్శించిన సమర్థతను ఎస్పీ కొనియాడారు. వీరి నిబద్ధత ప్రజల భద్రతకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్