పత్తికొండ: సీఐ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

పత్తికొండ పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ జయన్న నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. మోటార్ సైకిల్ వాహనదారులపై మద్యం పానంపై పరీక్షలు జరిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ కుటుంబం, సమాజ భద్రతలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సీఐ జయన్న సూచించారు.

సంబంధిత పోస్ట్