తుగ్గలి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ-1)గా ప్రవీణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎంఈఓ-1గా పనిచేసిన మాలతి పత్తికొండ మండలానికి బదిలీ కావడంతో, ఆమె స్థానంలో ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రవీణను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రవీణ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ విద్యా విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం తన ప్రధాన లక్ష్యమన్నారు.