తుగ్గలి: పెండింగ్ సర్వేలపై కలెక్టర్ అసంతృప్తి

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో, ఫిబ్రవరి 10లోగా సర్వే పూర్తి చేయాలని, ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచే ఫీల్డ్ పనులు ప్రారంభించాలని సూచించారు. పెద్దకడుబూరు, కర్నూలు అర్బన్, తుగ్గలి మండలాల్లో పెండింగ్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్