జొన్నగిరి హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమ్మేళనంలో విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాతృమూర్తి పేరిట మొక్కలు నాటారు. తల్లిదండ్రులను సన్మానించి, విద్యార్థుల భవిష్యత్ కోసం క్రమశిక్షణతో చదవాలని సూచించారు.