కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో జరిగిన జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వై మధుబాబు వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 109 ఓట్లకు గాను 101 ఓట్లు పోలవగా, వై మధుబాబు ప్యానెల్ మొత్తం విజయం సాధించింది. జయ రవికుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా, జగదీష్ గౌడ్ జనరల్ సెక్రటరీగా, నరసరావు లైబ్రరీ కం సెక్రటరీగా, సరోజ భాయ్ ట్రెజరర్‌గా, షాజీరా బేగం రిప్రజెంటివ్‌గా ఎన్నికయ్యారు.