ఆత్మకూరులో ఆదివారం కురుకుంద, కొట్టాలా చెరువులో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్టు సీఐ రాము తెలిపారు. అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. మహేశ్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 మద్యం సీసాలు సీజ్ చేసి అతన్ని అరెస్టు చేశారు. కురుకుంద జంక్షన్ వద్ద రోడ్డు నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.