శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి లలితా బాయి తనిఖీ చేశారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించిన ఆమె, హాజరు నమోదును పరిశీలించి, జనగణన స్వీయ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. హరిత రాయబార్లు చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కార్యదర్శులకు ఆదేశించారు.