శ్రీశైలం ధర్మకర్తల మండలిలో కీలక ఆమోదాలు

శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం గురువారం అధ్యక్షుడు పోతుకుంట రమేశ్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించి, 39 అంశాలకు ఆమోదం తెలిపారు. రెండు అంశాలను వాయిదా వేసి, ఒక అంశాన్ని తిరస్కరించారు. ఈవో శ్రీనివాసరావుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు క్షేత్రాభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలపై సమీక్షించి, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్