ఆత్మకూరు డంపింగ్ యార్డు పనులపై ఎమ్మెల్యే సమీక్ష

ఆత్మకూరులో మున్సిపాలిటీ నూతన డంపింగ్ యార్డు ఏర్పాటును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పరిశీలించారు. మున్సిపల్, సర్వే అధికారులతో కలిసి స్థల ఎంపిక, రహదారి సౌకర్యాలపై సమీక్షించారు. అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు, ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్