నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసులు ప్రతిరోజూ 'స్టాప్-వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో రాత్రిపూట వాహనాలను తనిఖీ చేసి, డ్రైవర్లకు భద్రతా సూచనలు అందిస్తున్నారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలిస్తూ, అతివేగం, రాంగ్‌రూట్, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.