శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్

రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, శ్రీశైల పుణ్యక్షేత్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని విపత్తుల సమయంలో ప్రజల రక్షణ, అగ్ని ప్రమాద నివారణ, తొక్కిసలాట నివారణ, సీపీఆర్, అత్యవసర తరలింపు వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్