నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం, అమలాపురం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరింగ్‌కు అవసరమైన మరమ్మత్తులు చేపట్టారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆయన చొరవతో పంచాయతీ సెక్రెటరీ రాజు ఆధ్వర్యంలో బోరింగ్ మరమ్మత్తుల పనులు పూర్తి చేయించారు. ఈ చర్యతో గ్రామంలో తాగునీటి సమస్య తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.