శివరాత్రి ఏర్పాట్లపై ఆలయ ఈవో పర్యవేక్షణ

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు సమర్థంగా కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్