శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 8 గేట్లను ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నారు. గేట్ల ద్వారా నీరు ప్రవహిస్తున్న విజువల్స్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వాటిని ఆస్వాదిస్తూ సందర్శకులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు