గోనెగండ్లలో వాహనాలు తనిఖీ

గోనెగండ్ల నందు ఆదివారం సాయంత్రం సిఐ చంద్రబాబు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి సీఐ చంద్రబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వాహనాలతో ఉంచుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్