గోనెగండ్లలో వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వెనుకబడిన సంక్షేమశాఖ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వంటగదిలో కూరగాయల నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, టాయిలెట్స్ పరిశుభ్రతపై వారి అభిప్రాయాలను సేకరించారు. విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్