కలుగొట్ల: ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, కలుగొట్ల గ్రామంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రూట్ బందోబస్తు, హెలిప్యాడ్, సభా ప్రాంగణం భద్రత, కాన్వాయ్ రిహార్సల్స్ వంటి అంశాలను సక్రమంగా నిర్వహించాలని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్