కలుగొట్ల: సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: వెంకటేష్

ఫిబ్రవరి 6న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి హెలిప్యాడ్, ప్రజావేదిక, పార్కింగ్, బ్యారికేడింగ్ ఏర్పాట్లను కలెక్టర్ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్