కర్నూలు: పదవీ విరమణ పొందిన అధికారులకు కలెక్టర్

ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసిన హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. చిరంజీవి, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి. మహదేవరావులను కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఘనంగా సన్మానించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, రేపు పదవీ విరమణ చేయనున్న ఇద్దరు అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. తమ శాఖల్లో నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించారని, హౌసింగ్, ఆయుష్ శాఖల సంక్షేమ కార్యక్రమాల అమలులో వారి పాత్ర విశేషమని కలెక్టర్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్