కర్నూలు: జూన్ 15న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

జూన్ 15 సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిష్కార స్థితిని తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ లేదా Meekosam Portal ద్వారా సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్