నందవరం మండలంలోని నందవరం, ముగతి, కనకవీడు గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శివరాజ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నీటి సరఫరాను మెరుగుపరచడం, పైప్‌లైన్ల మరమ్మతులు, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు, చేతిపంపుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. డ్రైనేజీలు, సీసీ రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.