పెసలదిన్నె సెక్రటరీని సస్పెన్షన్ చేయాలని నిరసన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామంలో పంచాయతీ సెక్రటరీపై విద్యార్థి సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను విస్మరించి, సమస్యలు అడిగినవారిపై బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింతగా విస్తరిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్