కార్మికుల సంక్షేమం కోసం లేబర్ అడ్డాలు ఏర్పాటు: మంత్రి సుభాష్

AP: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ‘లేబర్ అడ్డాలు’ ఏర్పాటు చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి సుభాష్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా తొలి దశలో 25 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలను అన్న క్యాంటీన్లతో అనుసంధానం చేసి కార్మికులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. లేబర్ అడ్డాల్లో తాగునీరు, వాష్‌రూమ్‌లు వంటి ప్రాథమిక వసతులతో పాటు అవగాహన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఈ కేంద్రాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్