AP: రాష్ట్రంలో 807 మద్యం షాపులకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,650 షాపులకు రెన్యువల్ నోటిఫికేషన్ జారీ చేయగా, 3,236 మంది యజమానులు రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 షాపులు, గతంలో మిగిలిన షాపులతో కలిపి మొత్తం 807 షాపులకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన జరిగి, అక్టోబర్ 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుంది.