మున్సిపల్ వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్

AP: మున్సిపల్ వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినంత మాత్రాన ఆయా స్థానిక సంస్థల భౌగోళిక, ప్రాంతాయ సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవని స్పష్టం చేసింది. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు, నిర్దిష్ట అధికార పరిధిలు ఉంటాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕