లిక్కర్ కేసు.. ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి శనివారం సిట్ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను సిట్ బృందం తయారు చేసింది. అందులో వందకు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచింది. రూ.62 కోట్లను సీజ్ చేసినట్లు నివేదికలో సిట్ పేర్కొంది. 268 మంది సాక్షులను విచారించినట్లు తెలిపింది. కాగా ఆ ఛార్జ్ షీట్‌తో సిట్ బృందం కాసేపట్లో జడ్జి నివాసానికి వెళ్లనుంది.

సంబంధిత పోస్ట్