భూభారతి రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రసన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమీషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్ కు ఈ ఆదేశాలు అందాయి. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని లోకాయుక్త కోరింది.