డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటలకు మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం కొనసాగనుంది. గ్రామాల్లోని తాగు నీరు, సాగు నీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలపై కీలక చర్చ కొనసాగనుంది. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు.