డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్

AP: స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మరోసారి మెగా పేరెంట్–టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల పురోగతి, పాఠశాల సమస్యలు, విద్యా ప్రమాణాలపై చర్చించనున్నారు. తల్లిదండ్రులతో పాటు ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు కూడా పాల్గొంటారు. విద్యాభివృద్ధికి పండుగలా నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. పాఠశాలల అభివృద్ధి, పది పరీక్షల సన్నద్ధతపై కూడా చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్