ఈ నెల 17న ఏపీ వ్యాప్తంగా 'మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్'

ఏపీ ప్రభుత్వం జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు రంపచోడవరంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేసి, వారి విద్యా పురోగతి, నైపుణ్యాలు, అభ్యాస స్థాయిపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్