డయేరియా ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా (VIDEO)

AP: శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు వెలుగుచూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డయేరియాతో చిన్నారావు అనే వ్యక్తి చనిపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఆరోగ్యశాఖ అధికారులను ఆరా తీశారు. గ్రామాన్ని తక్షణమే సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అత్యవసర వైద్య బృందాలను పంపించి చికిత్సను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన మందుల స్టాక్‌, తాగునీటి నమూనాల సేకరణ, శానిటేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్