'స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్' అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష (వీడియో)

AP: అమరావతిలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మన్సిపల్ కమిషనర్లతో మంగళవారం మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేని పట్టణాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజున పూర్తిగా సేకరించి తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యత పెంచుతూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్