ఉల్లి రైతుల అకౌంట్లోకి నేడు డబ్బులు

AP: ఉల్లి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్‌లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఇవాళ జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఉల్లి రైతుల అకౌంట్లోకి రూ.99.92 కోట్లు జమ కానున్నాయి.

సంబంధిత పోస్ట్