AP: పార్లమెంటరీ వాణిజ్య వ్యవహారాల (కామర్స్) కమిటీ సభ్యుడిగా ఎంపీ సానా సతీశ్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక విధివిధానాలను, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ఎగుమతులను కమిటీ పరిశీలించనుంది. అలాగే ఏపీకి చెందిన అనేక విషయాలను సానా సతీశ్‌బాబు జాతీయస్థాయిలో చర్చించే అవకాశం ఉంది.