ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓ ఆర్టీ నంబర్ 1286 ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. అక్టోబర్ 28న పోలింగ్ జరగనున్నందున, పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందునుంచే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.