ఇవాళ, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు (గురువారం), రేపు(శుక్రవారం) ఏపీ సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో జిల్లా ఆర్థిక వృద్ధి, స్వర్ణాంధ్ర విజన్, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, ప్రభుత్వ పథకాల అమలు సహా 19 కీలక అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. పెట్టుబడులు, శాంతిభద్రతలు, ప్రజా సేవల అమలుపై క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్ల నుంచి తెలుసుకోనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕