ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఈ. జయప్ప శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.