కర్నూలు: 'పౌర సమస్యలపై తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు'

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒకే సమస్య మూడుసార్లు పునరావృతం అయితే సంబంధించిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీ-4 పాలసీ, హౌసింగ్, ఉపాధి హామీ, తాగునీరు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 507 ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్