సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, ఫాతిమా షేక్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మహిళా విద్య, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఓర్వకల్లు ఎంఈవో ఓంకార యాదవ్, ఐహెచ్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనీస పాషా అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. వవారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిడ్ డే మీల్స్ ను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.