కర్నూలు: అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి: సీఎస్

వర్షాకాలంలో వాటర్, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర పి-4 ద్వారా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. డిఎంహెచ్ఓ సమావేశం జరిపి రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్