పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామ సమీపంలోని నల్లకొండ దగ్గర శంకన్న అనే రైతు పొలం వద్ద చిరుత కుక్కను తిన్న ఆనవాళ్లను గమనించినట్లు గురువారం వారు తెలిపారు. ఈ గ్రామ సమీపంలోని కటారుకొండ శివారులో గతేడాది జూలై నెలలో జింకను చిరుత తిన్న ఆనవాళ్లను, చిరుతను కొందరు చూశారు. ఫారెస్టు అధికారులు స్పందించి రక్షణ కల్పించాలన్నారు.