మహానంది మండలంలో ఈనెల 25 నుండి మార్చి 25 వరకు భూ రీసర్వే

మహానంది మండలంలో ఈనెల 25వ తేదీ నుండి మార్చి నెల 25వ తేదీ వరకు రీ సర్వే నిర్వహించనున్నట్లు మండల తహసిల్దార్ రమాదేవి గురువారం పేర్కొన్నారు. మండలం లోని తమ్మడపల్లె గ్రామం రీ సర్వే కు ఎంపిక అయిందని తెలిపారు. తమ్మడపల్లె గ్రామంలో ఈనెల 4వ తేదీ నుండి 24వ తేదీ వరకు రికార్డులు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అనంతరం 25వ తేదీ నుండి రీ సర్వే ప్రారంభిస్తామన్నారు. రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్