మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తులు రద్దీ బాగా పెరిగిందని ఆత్మకూరు ఎంవిఐ ఏఎస్ఎన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు గూడ్స్ వాహనాలలో అధికంగా వస్తున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గూడ్స్ వాహనాలలో ప్రయాణం చేయవద్దని, వస్తే సీజ్ చేసి, స్టేషన్ కు తరలిస్తామని హెచ్చరించారు. శ్రీశైలం వచ్చే వాహనాలకు జరిమానా విధిస్తామన్నారు.