ఆత్మకూరులో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

ఆత్మకూరు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు సీఐ గంగాధర్, ఎస్సై జంపని కుమార్ సాయంత్రం పలు ప్రాంతాల్లో పరిశీలనలు చేపట్టారు. ప్రధాన వీధిలో షాపుల ముందు వాహనాలు నిలపకుండా, రోడ్డుకు అవతల వైపు పార్కింగ్ చేసి కొనుగోళ్లు చేయాలని ప్రజలకు సూచించారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్