ఏ ఎస్ పేట దర్గా వద్ద భక్తుల భద్రతకు ప్రత్యేక పోలీసు పహారా

ఏఎస్‌పేట దర్గాలో భక్తుల భద్రతను మెరుగుపరిచేందుకు ఎస్సై జిలాని నూతన విధానాన్ని అమలు చేశారు. ప్రతి శుక్రవారం దర్గా వద్ద రాత్రి బస చేసే భక్తులు, వారి వస్తువుల భద్రత కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టి దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక పహారా ప్రతి శుక్రవారం కొనసాగుతుందని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్