వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన ఆయన, అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీతో కలిసి రికార్డు రూమ్, పలు విభాగాలను పరిశీలించి, భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై సమీక్షించారు. JSW కంపెనీ భూముల అంశంపై కూడా వివరాలు తెలుసుకున్నారు.