గుడ్లూరు మండలం పరిధిలో జరుగుతున్న రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులను సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. పోర్టు నిర్వహణ సామర్థ్యం, విస్తరణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో DRO ఓబులేసు, సబ్ కలెక్టర్ హిమవంశి పాల్గొన్నారు.